ఎలక్షన్ కమిషనర్‌గా అనూప్ చంద్ర పాండే..

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి అనూప్ చంద్ర పాండే బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనూప్‌ను ఎలక్షన్ కమిషనర్‌గా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. అనూప్ చంద్ర పాండే 2024 ఫిబ్రవరి(65 ఏళ్లు నిండే వరకు) వరకు ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఇటీవలే రిటైర్ కావడంతో సుశీల్ చంద్ర ఆయన […]

Update: 2021-06-09 11:44 GMT

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి అనూప్ చంద్ర పాండే బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనూప్‌ను ఎలక్షన్ కమిషనర్‌గా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. అనూప్ చంద్ర పాండే 2024 ఫిబ్రవరి(65 ఏళ్లు నిండే వరకు) వరకు ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ముగ్గురు సభ్యులుండే కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఇటీవలే రిటైర్ కావడంతో సుశీల్ చంద్ర ఆయన స్థానంలోకి పదోన్నతి పొందారు. ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు ఉండాలి. సుశీల్ చంద్ర పదోన్నతి పొందడంతో రాజీవ్ కుమార్ ఒక్కరే కమిషనర్‌గా ఉన్నారు. ఇప్పుడు అనూప చంద్ర పాండే రెండో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 37ఏళ్ల తన సర్వీసులో కేంద్ర మంత్రిత్వ శాఖలు సహా రాష్ట్ర స్థాయిల్లోనూ అనూప్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Tags:    

Similar News