పల్నాడు జిల్లాలో భారీగా అరెస్టులు.. కారణం ఇదే..!

పల్నాడు జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది...

Update: 2024-05-23 14:55 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల పోలింగ్ వేళ గురజాల నియోజకవర్గంలో అల్లర్లు చెలరేగాయి. పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వసం చేశారు.  దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు నిందితులను గుర్తించేపనిలో పడ్డారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి, తంగేడలో ఘర్షణలకు పాల్పడిన 22 మంది వైసీపీ శ్రేణులు, 11 మంది కార్యకర్తలను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సరసరావుపేట కోర్టులో ప్రవేశ పెట్టారు. వీరందరకీ ధర్మాసనం రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు జైలుకు తరలించారు.

కాగా పోలింగ్ రోజు మరిన్ని చోట్ల సైతం ఉద్రిక్తతపల్నాడు జిల్లాలో భారీగా అరెస్టులు.. కారణం ఇదే..! పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌లు చేస్తున్నారు. మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. మరోవైపు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు సైతం కఠిన ఆంక్షలు విధించనున్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీస్ భద్రత కొనసాగనుంది. 

Similar News