Railway News: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో జూన్ 30 వరకు రైళ్లు రద్దు!

మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున మే 27 నుంచి జూన్ 30 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

Update: 2024-05-23 15:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున మే 27 నుంచి జూన్ 30 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మేరకు 07462/63 వరంగల్-సికింద్రాబాద్ పుష్ పుల్ రైలు, 17035/36 కాజీపేట-బల్లార్షా, 07766/65 కరీంనగర్-సిర్పూర్ టౌన్, 07894 కరీంగనర్-బోధన్ రైలు జూన్ 30 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అదేవిధంగా ఏపీలో ప‌లు రైళ్లను ర‌ద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో గ‌ల నిర్వహణ పనుల కార‌ణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు.

07977/07978 నెంబ‌ర్‌గల విజయవాడ-బిట్రగుంట మధ్య నడిచే ట్రైన్స్ మే 27 నుంచి జూన్ 23 వరకు రద్దు చేశారు. వీటితోపాటు మే 27 నుంచి 31 వరకు, జూన్ 3 నుంచి 7 వరకు, జూన్ 10 నుంచి 14 వరకు.. జూన్ 17 నుంచి జూన్ 21 వరకు 17237/17238 అనే నెంబ‌ర్‌ గ‌ల బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ట్రైన్స్ ర‌ద్దయిన‌ట్లు తెలిపారు. గుంటూరు-రాయగడ 17243/17244 ట్రైన్స్ కూడా మే 27 నుంచి జూన్ 24 వరకు రద్దయ్యాయి. కాకినాడ పోర్ట్- విశాఖపట్నం మధ్య నడిచే 17267/17268 ట్రైన్స్ కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Click Here For Twitter Post..

Tags:    

Similar News