ఆరో దశ పోలింగ్‌లో సంపన్న, పేద అభ్యర్థులు వీరే

అత్యధిక సంపన్న, పేద అభ్యర్థులు ఇద్దరూ హర్యానా రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం.

Update: 2024-05-23 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆరో దశ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇప్పటికే ఐదు దశలు పూర్తయిన అనంతరం ఈ దశలో పలువురు కీలక అభ్యర్థులు పోటీలో ఉండగా, అధిక సంపన్న, పేద అభ్యర్థులు ఇద్దరూ హర్యానా రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. అత్యధిక సంపదను అఫిడవిట్‌లో పేర్కొన్న అభ్యర్థి కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉన్న బీజేపీ నేత నవీన్ జిందాల్ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1,241 కోట్లుగా ఉంది. అలాగే, స్వతంత్ర అభ్యర్థిగా రోహ్‌తక్ నియోజకవర్గం నుంచి కేవలం రూ. 2 ఆస్తులతో రణధీర్ సింగ్ పోటీలో ఉన్నారు. అత్యధికంగా ఆస్తులున్న ఎంపీ అభ్యర్థుల జాబితాలో నవీన్ జిందాల్ తర్వాత మిగిలిన వారిలో సంత్రుప్ట్ మిశ్రా-బీజేడీ(రూ. 482 కోట్లు, కటక్ నియోజకవర్గం), సుశీల్ గుప్తా-కురుక్షేత్ర(రూ. 169 కోట్లు, ఆప్), నైనా సింగ్ చౌతాలా-హిసార్(రూ. 139 కోట్లు, జేజేపీ), రావ్ ఇంద్రజిత్ సింగ్-గురుగ్రామ్(రూ. 121 కోట్లు, బీజేపీ), ఫౌజీ జై కవార్ త్యాగి-గురుగ్రామ్(రూ. 113 కోట్లు, కాంగ్రెస్), మేనకా సంజయ్ గాంధీ-సుల్తాన్‌పూర్(రూ. 97 కోట్లు, బీజేపీ), మహేంద్ర ప్రతాప్ సింగ్-ఫరీదాబాద్(రూ. 90 కోట్లు, కాంగ్రెస్), బహదూర్ సింగ్-మహేంద్రగఢ్(రూ. 88 కోట్లు, జేజేపీ), రాజ్ కుమార్ ఆనంద్-న్యూఢిల్లీ(రూ. 83 కోట్లు, బీఎస్పీ) ఉన్నారు.

అత్యల్ప ఆస్తులు ఉన్న అభ్యర్థుల్లో రణధీర్ సింగ్ తర్వాత రామ్‌కుమార్ యాదవ్-ప్రతాప్‌గఢ్(రూ. 1,686, ఎస్‌యూసీఐ(సీ)), ఖిల్ఖిలాకర్-నార్త్‌వెస్ట్ ఢిల్లీ(రూ. 2,000, బహుజన్ సోషిత్ సమాజ్ సంఘర్ష్ సమతా పార్టీ), నంద్ రామ్-నార్త్‌వెస్ట్ ఢిల్లీ(రూ. 2,000, బగ్రీ వోటర్స్ పార్టీ ఇంటర్నేషనల్), దిల్లీప్ కుమార్-పూర్(రూ. 4,032, కాంగ్రెస్), జోయ్‌దేవ్ ధంక్-బిష్ణుపూర్(రూ. 5,000, బీఎస్పీ), అశ్వని-సోనిపత్(రూ. 5,319, కాంగ్రెస్), సుభాష్-మచ్లిషహర్(రూ. 10,000, కాంగ్రెస్), సంజీబ్ దే-మేదినీపూర్(రూ. 13,056, కాంగ్రెస్), వీరేంద్ర-దక్షిణ ఢిల్లీ(రూ. 14,000, కాంగ్రెస్) అభ్యర్థులు బరిలో ఉన్నారు.  

Tags:    

Similar News