రాజమహేంద్రవరం రా కదిలిరా సభలో ఉద్రిక్త..

ఈ రోజు రాజమహేంద్రవరం లో టీడీపీ నిర్వహిస్తున రా కదిలిరా బహిరంగ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Update: 2024-01-29 10:58 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు రాజమహేంద్రవరం లో టీడీపీ నిర్వహిస్తున రా కదిలిరా బహిరంగ సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజానగరం సీటు నేపథ్యంలో ఈ సీటు ఉద్రిక్థత నెలకొంది. టీడీపీ జనసేన మధ్య సద్దు మణిగింది అనుకున్న రాజానగరం సీటు వివాదం.. నివురుగప్పిన నిప్పుల ఈ రోజు మళ్ళీ రాజుకుంది. ఉదయం విమానాశ్రయం దగ్గర కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ నేతలు జై టీడీపీ అనే నినాదాలు చెయ్యగా.. జనసేన సైనికులు జై జనసేన అనే నిదాలు చేశారు. ఇరు పార్టీ నేతలు రెండు రకాల నినాదాలు చేయడంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు జోక్యం చేసుకుని ఇరు పార్టీ నేతలను సముదాయించి పరిస్థితిని నియతంత్రం లోకి తీసుకొచ్చారు. అనంతరం సభా వేదిక దగ్గరకు చేరుకున్నారు. సభ మొత్తం ప్రశాంతంగా జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు. ఇక చంద్రబాబు ప్రసంగం ముగిసిన తరువాత వేదిక దిగి వెళ్లిపోతున్న సమయంలో మళ్ళీ రాజానగరం టికెట్ గురించి జనసేన నేతలు చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు.

కాగా టికెట్ గురించి ప్రస్తావించాడనికి ఇది సరైన సమయం కాదని చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన జనసేన నేతలు వేదిక పై నుండి దూకుడుగా కిందకి దిగే నేపధ్యంలో తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో జనసేన నేతలు చంద్రబాబు పై పడడంతో కొందిగా ఆయన పక్కకు ఒరిగి కింద పడబోయారు. ఇది గమనించిన బౌన్సర్లు టీడీపీ నేతలు వెంటనే చంద్రబాబును పడకుండా పట్టుకున్నారు. దీనితో చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.

స్టేజ్ కిందకి దిగిన తరువాత కూడా జనసేన నేతల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ నేతలు నచ్చచెపేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా జనసేన నేతలు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనితో ఒక్కసారిగా సభాప్రాంగణంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. 

Tags:    

Similar News