విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి స్టార్ హోటల్ ఫుడ్

ఏపీలో విద్యార్థులకు స్టార్ హోటల్ ఫుడ్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...

Update: 2024-05-26 16:20 GMT

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థుల వేసవి సెలవు ముగిసే గడువు దగ్గర పడింది. మరొకొద్ది రోజుల్లో స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకూ అందించిన మధ్నాహ్న భోజనాన్ని మరింత రుచికంగా అందించాలని నిర్ణయించింది. స్టార్ హోటల్ ఫుడ్ మాదిరిగా తయారు చేసి విద్యార్థులకు పెట్టాలని కసరత్తు ప్రారంభించారు. మొత్తం 44 వేల 190 స్కూళ్లలో ఒకే రకమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని చర్యలు చేపడుతున్నారు.

ఇందుకోసం మధ్యాహ్నం భోజనం వండే ఏజెన్సీ మహిళలకు స్టార్ హోటల్స్‌లో పని చేసే చెఫ్‌లతో శిక్షణ ఇప్పిస్తోంది. మధ్యాహ్న భోజన తయారీకి సంబంధించి పప్పు, వెజ్ కర్రీ, పులిహోరా, వెజ్ బిర్యానీ, పొంగల్, పప్పుచారు వంటి వంటకాలపై మహిళలకు విజయవాడలో తాజ్ హోటల్ చెఫ్‌లు ట్రైనింగ్ ఇచ్చారు. అంతేకాదు వంటకాలను వీడియో తీసి, ఆరోగ్య ప్రయోజనాలను వివరిస్తూ వీడియోలు తయారు చేశారు. ఈ వీడియోలను తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో అప్ చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే టీచర్లు వీటిని డౌన్ లోడ్ చేసి.. మధ్యాహ్న భోజనం తయారు చేసే ఏజెన్సీ నిర్వాహకులకు పంపాలని సూచించారు.

Similar News