Breaking: మరో వైసీపీ నేత అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. అయితే నరసారావుపేటలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి...

Update: 2024-05-26 15:55 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరిగాయి. అయితే నరసారావుపేటలో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. అంతా ప్రశాంతం అనుకునే సమయంలో వైసీపీకి చెందిన నాయకుడు నెహమియా రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన తర్వాత ఓ పార్టీకి చెందిన వారిని ఇళ్లకెళ్లి కొడతామని హెచ్చరించారు. బూతులు తిడుతూ బెదిరించారు. దీంతో నరసరావుపేట డీఎస్పీ సుధాకర్ రావు సీరియస్ అయ్యారు. నెహమియాపై 188, 153ఏ, 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

Similar News