తగ్గిన దిగుబడి.. పెరిగిన గిరాకీ.. కొండెక్కిన టమోటా రేటు

ఏపీలో టమోటా ధరలు కొండెక్కాయి...

Update: 2024-05-26 16:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎండలు బాగా పెరగడంతో కూరగాయలు కొండెక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు టమోటా మరింత ప్రిమీయం కానుంది. వేసవీ కావడంతో టమోటా దిగుబడి భారీగా పడిపోయింది. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. నాలుగు రోజులుగా టమోటా ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండటంలేదు. రోజు, రోజుకు మరింత పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం రూ. 10 కూడా లేని ధర నాలుగు రోజులుగా రూ. 30కు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా కిలో రూ. 40 పలుకుతోంది. పదిహేను కేజీల బాక్సు ధర రూ. 550 నుంచి 600 వరకూ పలుకుతోంది. టమోటాలు అధికంగా దిగుబడి అనంతపురంలో సైతం డిమాండ్ పెరిగింది. దిగుబడులు గణనీయంగా తగ్గడంతో ఏపీలోని పలు ప్రాంతాలు, చెన్నైలో గిరాకీ పెరిగింది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు టమోటా ధరలు మరింత పెరుగుతాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News