అందరూ మెచ్చిన కానిస్టేబుల్ .. ఎలా అయ్యాడంటే..!

కాకినాడ జగన్నాథపురంలో కానిస్టేబుల్ రవికుమార్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ..

Update: 2024-05-26 15:42 GMT

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జగన్నాథపురంలో కానిస్టేబుల్ రవికుమార్ అందరి ప్రశంసలు అందుకున్నారు. జగన్నాథపురం పాత వంతెన వద్దకు వచ్చిన ఓ వృద్ధుడు దాని పైనుంచి కాలువలోకి దూకేందుకు యత్నించారు. అయితే వృద్ధుడి ప్రయత్నాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రవి కుమార్ పరిగెత్తుకుంటూ వచ్చి వృద్ధుడిని కాలువలోకి దూకనివ్వకుండా అడ్డుకున్నారు. వంతెన పై నుంచి దించి సురక్షితంగా కాపాడారు. అనంతరం వృద్ధుడి ఆవేదనను అర్థం చేసుకుని సర్ధి చెప్పి ఇంటికి పంపారు. ఇప్పుడు ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కానిస్టేబుల్ రవి కుమార్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలు కురిపిస్తు్న్నారు. కాకినాడ వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో రవికుమార్ పని చేస్తున్నారు. వృద్ధుడిని కాపాడిన విషయం తెలియడంతో తోటి పోలీసులు సైతం అభినందించారు. 

Similar News