Sri Rama Navami: ఆలయాల వద్ద భారీ బందోబస్తు

ఆళ్లగడ్డలో శ్రీరామనవమి ఉత్సవాలకు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు టౌన్ సిఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు..

Update: 2023-03-29 14:42 GMT

దిశ, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు టౌన్ సిఐ జీవన్ గంగానాద్ బాబు తెలిపారు. ఆళ్లగడ్డలో రెండు ప్రధాన ఆలయాల్లో శ్రీరామనవమి కల్యాణం, వేడుకలు జరుగుతున్న సందర్భంగా ఆలయాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ జీవన్ గంగానాథ్ బాబు కోరారు.

Tags:    

Similar News