నంద్యాలలో ఎస్ఐ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి హల్చల్

నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ హల్చల్ చేశాడు.

Update: 2024-05-23 11:17 GMT

దిశ ప్రతినిధి నంద్యాల సిటీ: నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి రామకృష్ణ హల్చల్ చేశాడు.జిరాక్స్ సెంటర్ నడుపుకుంటున్న యువకుడిపై మరో వ్యక్తితో కలిసి దాడికి పాల్పడ్డాడు. తాను ఎస్ఐనని జిరాక్స్ కాపీ ఒక్క రూపాయికి ఇవ్వాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మీరు ఏ స్టేషన్‌లో ఎస్‌ఐ అని స్థానికులు అడగగా పొంతన లేని సమాధానాలు రామకృష్ణ అనే నకిలీ ఎస్ఐ చెప్పాడు.

ఈ నేపథ్యంలో బాధితుడు మాట్లాడుతూ.. నకిలీ ఎస్ఐ రామకృష్ణ మరో వ్యక్తి కలిసి తనపై దాడి చేశారని, ఇది గమనించిన పక్క దుకాణాల వారు అడ్డుకుని తనని రక్షించినట్టు తెలిపారు. అతను ఎస్ఐని అని చెప్పడంతో అనుమానం వచ్చిన స్థానికులు జిల్లా ఎస్పీ గారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నకిలీ ఎస్ఐని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.

పోలీస్ శాఖ పేరును వాడుకోవడంపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నకిలీ ఎస్‌ఐ రామకృష్ణతోపాటుగా మరో వ్యక్తి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాను ఎస్ఐనంటూ దాడికి పాల్పడిన రామకృష్ణ అనే వ్యక్తి గతంలో ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగం నుండి తొలగింపబడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

Similar News