కర్నూలు జిల్లా రైతుకు వరించిన వజ్రం.. విలువ ఎంతో తెలుసా?

కర్నూలు జిల్లాలో వజ్రాం కోసం సాగించిన వేట ఫలితాన్ని ఇచ్చింది...

Update: 2024-05-25 08:55 GMT

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో తొలకరి వర్షం కురిసింది. దీంతో రైతులు పొలం బాట పట్టారు. వ్యవసాయం చేసేందుకు కాదు.. వజ్రాల వేట కోసం. తొలకరి వర్షంతో కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో వజ్రాలు దొరుకుతాయి. ఇప్పటికే చాలా మందికి దొరికాయి. లక్షల విలువైన వజ్రాలు సైతం లభించాయి. దీంతో తొలకరి వర్షం పడితే చాలు పొలం పనులు ఆపేసి మరీ వజ్రాల కోసం వేట కొనసాగిస్తారు. ఇలా ఓ రైతు కొనసాగించిన వేటకు ఫలింతం దక్కించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగిన వేటలో హంప గ్రామానికి చెందిన రైతును వజ్రం వరించింది. దీంతో ఆ వజ్రాన్ని కొనేందుకు వ్యాపారులు క్యూ కట్టారు. రూ. 5 లక్షలు, రెండు తులాల బంగారం ఇచ్చి రైతు నుంచి ఓ వ్యాపారి వజ్రాన్ని తీసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఈ వజ్రం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయం తెలియడంతో పొలాలకు భారీగా తరలివెళ్తున్నారు. భోజనం కట్టుకుని మరీ వెళ్లి సాయంత్రం వరకూ పొలాల్లో వెతుకుతున్నారు. కొందరైతే పొలాలను లీజుకు తీసుకుని మరీ వెతులాట కొనసాగిస్తున్నారు. ఒక్క వజ్రమైనా దొరకకపోదా.. లక్షాదికారులం కామా అంటూ వేటను కొనసాగిస్తున్నారు. 

Similar News