ఊరి చివర కొండల్లో చిరుత పులి పిల్ల.. భయాందోళనలో రైతులు

నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకిపోతున్నారు....

Update: 2024-05-22 13:08 GMT

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకిపోతున్నారు. ఊరి చివర కొండ గుహల్లో ఓ చిరుతపులి కనిపించింది. దీంతో తల్లి పులి దాడులు చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. చనుగొండ గ్రామానికి చివరన కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. గతంలోనూ చిరుతలు సంచరిస్తుండటాన్ని స్థానికులు గమనించారు. కొండ గుహల్లో నక్కి ఆ వైపు వెళ్లే పశువులపై దాడి చేసిన సంఘటనలు జరిగాయి.

తాజాగా కొండ గుహల్లో చిరుత కూన కనిపించింది. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. చిరుత కూన ఉందంటే పెద్దది కూడా ఉంటుందని, తమపై దాడి చేస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతలను బంధించే ప్రయత్నం చేయాలని కోరుతున్నారు. 

Similar News