Breaking: రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు స్పాట్ డెడ్

నంద్యాల జిల్లా డోన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ...

Update: 2024-05-25 03:04 GMT

దిశ, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దశరథ, ముని, ప్రభాకర్‌. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. గుర్తు తెలియని వాహనం అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానిక సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల బంధువుల ఆర్తనాదాలతో డోన్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Similar News