Kurnool: ఆరుగంటల్లోనే 63 తులాల బంగారం, రూ.14 లక్షలు రికవరీ

నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం రామాపురంలో మల్లు వెంకటేశ్వర రెడ్డి (నడిపెన్న) ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు....

Update: 2023-04-03 16:38 GMT

దిశ , బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం రామాపురంలో మల్లు వెంకటేశ్వర రెడ్డి (నడిపెన్న) ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు సూర్యచంద్రుడు, వన్నప్ప రామాంజనేయులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 63 తులాల బంగారం, 14 లక్షల నగదును రికవరీ చేశారు. ఇంటి యజమాని నమ్మిన వ్యక్తులే దొంగతనానికి పాల్పడడంతో మండలంలో చర్చ జరుగుతుంది. ఇంత భారీ స్థాయిలో దొంగతనం జరగడం అవుకు మండలంలో ఇదే ప్రథమం. ఎస్సైతో పాటు అవుకు పోలీసులు జిలాని, వెంకటేష్ నాయక్, హోంగార్డు చక్రవర్తి ను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు.

Tags:    

Similar News