నా భార్యకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు

ఉమ్మడి కర్నూలు జిల్లా అస్సరిలో 30.83 ఎకరాల భూ లావాదేవీలపై మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. ..

Update: 2022-12-01 12:22 GMT

- మంత్రి గుమ్మనూరు జయరాం

దిశ, డైనమిక్ బ్యూరో: ఉమ్మడి కర్నూలు జిల్లా అస్సరిలో 30.83 ఎకరాల భూ లావాదేవీలపై మంత్రి గుమ్మనూరు జయరాం స్పందించారు. ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో తన సతీమణి రేణుకమ్మకు ఆదాయపన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవంలేదని చెప్పుకొచ్చారు. తన భార్యకు ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాకుండానే ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. ఇకపోతే రేణుకమ్మ పేరిట జయరాం కుటుంబం రూ.52.42 లక్షలతో 30.83 ఎకరాలను కొనుగోలు చేసిందని.. ఈ కొనుగోలుకు సంబంధించి లెక్కల వివరాలు ఇవ్వకపోవడంతో ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి నోటీసులు రాలేదంటూ జయరాం గట్టిగా చెప్పారు.

Tags:    

Similar News