మళ్లీ వారికి అధికారం ఇస్తే.. మరో కాశ్మీరే..

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పశ్చిమ బెంగాల్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరో కాశ్మీర్‌లా మారుతుందని బీజేపీ నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారి అన్నారు. నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సువేందు మాట్లాడుతూ.. ‘ఒకవేళ శ్యాం ప్రసాద్ ముఖర్జీ లేకుంటే భారత్ ఇస్లామిక్ దేశంగా మారి ఉండేదని అన్నారు. మనం బంగ్లాదేశ్‌లో నివసిస్తూ ఉండేవాళ్లమని సంచలన వ్యాఖ్యలు […]

Update: 2021-03-07 06:55 GMT

కోల్‌కతా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పశ్చిమ బెంగాల్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరో కాశ్మీర్‌లా మారుతుందని బీజేపీ నందిగ్రామ్ అభ్యర్థి సువేందు అధికారి అన్నారు.

నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సువేందు మాట్లాడుతూ.. ‘ఒకవేళ శ్యాం ప్రసాద్ ముఖర్జీ లేకుంటే భారత్ ఇస్లామిక్ దేశంగా మారి ఉండేదని అన్నారు. మనం బంగ్లాదేశ్‌లో నివసిస్తూ ఉండేవాళ్లమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వాళ్లు (టీఎంసీ) తిరిగి అధికారంలోకి వస్తే బెంగాల్‌ మరో కాశ్మీర్‌లా మారుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

తప్పేముంది : ఓమర్ అబ్దుల్లా కౌంటర్

సువేందు వ్యాఖ్యలపై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఓమర్ అబ్దుల్లా స్పందించారు. ‘మీ (బీజేపీ) పార్టీ నాయకులు చెబుతున్నదాని ప్రకారం 2019 తర్వాత కాశ్మీర్ స్వర్గంగా మారింది కదా. ఇప్పుడు బెంగాల్ కూడా కాశ్మీర్‌లా మారితే తప్పేముంది..? ఏదేమైనా బెంగాళీలు కాశ్మీర్‌ను ప్రేమిస్తారు. ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తారు.. అంటూ చురకలంటించారు.

Tags:    

Similar News