Hottest cities: దేశవ్యాప్తంగా అత్యంత వేడైన నగరాలు ఇవే.. మీ నగరం ఉందేమో చూడండి..!

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

Update: 2024-04-30 08:56 GMT

దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటితే చాలు భానుడు భగభగలాడుతున్నాడు. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఉష్ణోగ్రతలు 45 నుండి 46 డిగ్రీల సెల్సియస్ కూడా నమోదు అవుతున్నాయి. దీంతో పలు నగరాల్లో నిప్పుల కొలిమిలో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఏదైనా పనులు ఉంటే ఉదయం తొమ్మిది గంటల లోపు పూర్తి చేసుకొని, 9 గంటలకల్లా ఇల్లకు చేరుకుంటున్నారు.

ఇక దేశవ్యాప్తంగా నిన్న కొన్ని నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నగరాలు కూడా ఉండడం గమనార్హం. కలైకుండా నగరంలో 45.4° గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఖండాలాలో కూడ 45.4° ఉష్ణోగ్రత నమోదయింది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాలలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అలానే బారిపాడాలో 44.8° ఉష్ణోగ్రత, అనంతపూర్‌లో 44.7°, మిడ్నాపూర్ 44.5°, అంగూల్‌లో 44.3°, కర్నూలులో 44.3°, ప్రయాగరాజ్‌లో44.2°, బంకురాలో 44.2° డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Similar News