చిన్నస్వామి స్టేడియంకు అద్భుతమైన ప్రత్యేకత!.. ఎన్ని నీరు పోసిన ఇట్టే ఇంకిపోతున్నాయి (వీడియో వైరల్)

మైదానంలో చిన్న వర్షం పడ్డ కూడా మైదానం తడిసి పోవడంతో ఆ రోజు జరగాల్సిన ఆటను ఆపేసి వాయిదా వేస్తుంటారు.

Update: 2024-05-17 11:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మైదానంలో చిన్న వర్షం పడ్డ కూడా మైదానం తడిసి పోవడంతో ఆ రోజు జరగాల్సిన ఆటను ఆపేసి వాయిదా వేస్తుంటారు. అలాంటిది మూడు ట్యాంకర్ల నీరు మైదానంలో ఓకే చోట పోసినా ఇట్టే మాయమైపోయాయి. ప్రపంచంలో ఏ మైదానానికి లేని ఓ ప్రత్యేకత చిన్నస్వామి స్టేడియంకు ఉంది. బెంగళూరులోని చిన్న స్వామి క్రికెట్ స్టేడియంలో ఎన్ని నీళ్లు పోసినా ఇట్టే ఇంకిపోతున్నాయి. ఈ మైదానం ప్రపంచంలోనే ఎక్కడా లేని సబ్ ఎయిర్ డ్రైనేజీ, ఎయిరేషన్ సిస్టమ్ ను కలిగి ఉంది.

దీనిని ఇటీవలే పరీక్షించిన అధికారులు నిర్ఘాంతపోయారు. మూడు పైపుల ద్వారా మైదానంలో నీరు వదిలిన తర్వాత అందరూ చూస్తుండగానే కొద్ది సేపటికే నీరు మొత్తం భూమిలోకి ఇంకిపోయింది. అనంతరం అధికారులు మైదానాన్ని తడిమి చూడగా కొంచెం కూడా తడి లేదని తేల్చేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి సిస్టమ్ అన్ని మైదానాలకు ఉంటే బాగుంటుంది అని, ఇలా అయితే ఏ ఒక్క మ్యాచ్ కు కూడా అంతరాయం కలగదని, రేపు జరగబోయే మ్యాచ్ కు కూడా వర్షం వచ్చినా ఆగకుండా ఉంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు.

Similar News