ఫ్లై ఓవర్‌పై భార్యను దారుణంగా చితకబాదిన భర్త.. అందరూ చూస్తుండగానే.. (వీడియో)

ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ క్రూరంగా ప్రవర్తిస్తోన్న ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

Update: 2024-04-30 08:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ క్రూరంగా ప్రవర్తిస్తోన్న ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూసినట్లైతే.. చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్ పై రోషన్ అనే వ్యక్తి తన భార్యను దారుణంగా చితకబాదుతున్నాడు. అనంతరం ఆమెను ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియోను ఫ్లై ఓవర్‌పై ఉన్న బాటసారులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. కాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో డాక్టర్ కార్తీక్ కుప్పన్ అనే యూజర్ పోస్ట్ చేసి.. ‘‘చెన్నైలో యువతిపై ఓ యువకుడు దారుణంగా దాడి చేశాడు. ఫ్లైఓవర్ పై నుంచి తోసేసి చంపే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?’’ అని రాసుకొచ్చాడు. దీనికి పోలీసులు.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడ్ని పట్టుకుని అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, నిందితుడు రోషల్ గా గుర్తించామని తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రీ పోస్ట్ చేశారు.

Similar News