Crime News: ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. కత్తులతో పొడుచుకున్న తల్లీకూతుళ్ళు..

పిల్లలకు మంచి మార్కులు రావాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు.

Update: 2024-04-30 08:24 GMT

దిశ వెబ్ డెస్క్: పిల్లలకు మంచి మార్కులు రావాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆశపడతారు. అయితే కొన్నిసార్లు పిల్లలకు తక్కువ మార్కులు వస్తాయి. నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులు ఆ పిల్లలను ప్రోత్సహించేందుకు ధైర్యం చెబుతారు. ఈసారి కాకపోతే వచ్చేసారి మంచి మార్కులు వస్తాయి బాధపడుతూ అని తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతున్న పిల్లలను ప్రోత్సహిస్తారు.

మరి కొంతమంది తల్లిదండ్రులు తక్కువ మార్కులు వస్తే మందలిస్తారు. ఈసారి తక్కువ మర్కులు వస్తే తోలు తీస్తా అని బెదిరిస్తారు. అయితే మార్కులు తక్కువ వచ్చాయని తల్లీకూతుళ్ళు కత్తులతో పొడుచుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. కర్నాటక రాష్ట్రంలోని మల్లేశ్వరం, బనశంకరి ప్రాంతంలో పద్మజ(40) తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది.

కాగా ఆమె కుమార్తె సాహితి (19) ఇంటర్ చదువుతోంది. అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. కాగా ఆ ఫలితాల్లో సాహితికి 40 మార్కులు తక్కువ వచ్చాయి. దీనితో ఆమెను తల్లి పలుమార్లు ప్రశ్నించింది. అడిగిందే మళ్ళీ మళ్ళీ అడుగుతుండడంతో విసుగుచెందిన సాహితి విచక్షణ కోల్పోయింది. పదేపదే తల్లి ప్రశ్నించడంతో కోపంతో రగిలిపోయిన సాహితి కత్తి తీసుకొని తల్లిని పొడించింది.

దినితో గాయపడిన తల్లి అదే కత్తి తీసుకొని కుమార్తె సాహితిని పొడవడంతో సాహితి ఘటనా స్థలంలోనే చనిపోయింది. కాగా గాయపడిన తల్లిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పద్మజ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News