కోలుకున్న అమిత్ షా..

by  |
కోలుకున్న అమిత్ షా..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు తక్షణ చర్యలు చేపడుతున్నా ఆశించినంత ఫలితం దక్కడం లేదు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వాటి కట్టడికి వైద్య అధికారులతో కలిసి కేంద్ర హోంమంత్రి ఆస్పత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను ఆరా తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

గత కొద్దిరోజులుగా ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందిన ఆయన శుక్రవారం పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు ధృవీకరించారు. అయితే, తాను మరికొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నట్లు అమిత్ షా తెలిపారు.

Next Story