రాహుల్‌ వ్యాఖ్యలపై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్

by  |
రాహుల్‌ వ్యాఖ్యలపై అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్
X

న్యూఢిల్లీ: ఇండియా చైనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. భారత భూభాగాన్ని కేంద్రం తన చేతగానీతనం వలన చైనాకు అప్పజెప్పిందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాహుల్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో భారతీయుల విశ్వాసం దెబ్బతినేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికారు. ఈ విషయంలో రాహుల్ కాస్త ఉన్నతంగా ఆలోచిస్తే బాగుంటుందన్నారు. దానికి తోడు గాల్వాన్ లోయలో గాయపడ్డ ఓ జవాను తండ్రి మాట్లాడిన వీడియోను షా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

భారత ఆర్మీ అత్యంత ధైర్య సాహసాలు కలది. చైనాను ఓడించే సత్తా ఉన్న మన జవాన్లకు ఉన్నది. రాహుల్ గాంధీ.. మీరు అప్పుడే రాజకీయాల్లో మునిగిపోకండి. నా కొడుకు చైనా సైన్యంతో పోరాడాడు. ఆ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాడు.’’ అని ఓ జవాన్ తండ్రి ఆ వీడియోలో పేర్కొన్నారు.

దీనిపై అమిత్‌ షా ట్వీట్ చేస్తూ..‘‘అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఓ జవాను తండ్రి మాట్లాడిన మాటలు ఇవి.. రాహుల్ గాంధీకి ఆయన స్పష్టమైన జవాబిచ్చారు. దేశం మొత్తం ఒకే తాటిపై ఉన్న సమయంలో దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా కాస్త ఉన్నతంగా ఆలోచించాలి. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయకూడదని’’ షా ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.

Next Story