- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యవసరానికి బ్రేకులు.. నడిరోడ్డుపై రోగి తీవ్ర అవస్థలు
by Sridhar Babu |
<p>దిశ, ములకలపల్లి : అత్యవసర సేవలు అందించాల్సిన అంబులెన్స్ (108) వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. తక్షణం వైద్యం అందాల్సిన రోగి అంబులెన్స్‌లో అచేతన స్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. శుక్రవారం ములకలపల్లి మండలంలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వ అంబులెన్స్‌ల దుస్థితికి అడ్డంపడుతోంది. ములకలపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన గొల్లపూడి దుర్గ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది లేక పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మొర్రెడువాగు బ్రిడ్జిపై టైర్ పగిలిపోవడంతో […]</p>

X
దిశ, ములకలపల్లి : అత్యవసర సేవలు అందించాల్సిన అంబులెన్స్ (108) వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. తక్షణం వైద్యం అందాల్సిన రోగి అంబులెన్స్‌లో అచేతన స్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. శుక్రవారం ములకలపల్లి మండలంలో జరిగిన ఈ ఘటన ప్రభుత్వ అంబులెన్స్‌ల దుస్థితికి అడ్డంపడుతోంది. ములకలపల్లి మండలం మాధారం గ్రామానికి చెందిన గొల్లపూడి దుర్గ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది లేక పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మొర్రెడువాగు బ్రిడ్జిపై టైర్ పగిలిపోవడంతో అంబులెన్స్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రోగిని మరొక వాహనంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story






