అమెజాన్ కీలక నిర్ణయం

by  |
అమెజాన్  కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెజాన్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగిస్తూ నిర్ణయించింది. కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును ఇస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ తదితర సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయడానికి అనుమతిని ఇచ్చాయి. గతంలోనే అమెజాన్ ఉద్యోగులకు వచ్చే ఏడాది జనవరి వరకు ఇచ్చింది. తాజాగా దీన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2021, జూన్ 30 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఉద్యోగులకు అవకాశమిస్తూ అమెజాన్ ప్రకటనను వెలువరించింది.

ఈ సమాచారాన్ని సంస్థ మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. అలాగే, ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇటీవల అమెరికాలోని అమెజాన్ ఉద్యోగుల్లో 19 వేల మందికి కరోనా సోకడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పైగా, కరోనా వ్యాప్తి విపరీతంగా ఉన్నప్పటికీ అమెజాన్ తన గోడౌన్‌లను నిర్వహిస్తూ ఉద్యోగులు కరోనా బారిన పడేందుకు కారణమైందనే ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ వచ్చే ఏడాది జులై వరకు, గూగుల్ సంస్థ జూన్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇచ్చిన తర్వాత అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.



Next Story

Most Viewed