యాపిల్‌ యూజర్లకు శుభవార్త చెప్పిన అమెజాన్‌ ప్రైమ్‌

by  |
Amazon Prime
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెజాన్‌ ప్రైమ్‌(Amazon Prime) యాపిల్‌ మాక్‌ ఓఎస్‌ యూజర్ల(Apple Mac OS users)కు శుభవార్త చెప్పింది. అమెజాన్‌ ప్రైమ్‌ యాప్‌ ఇక నుంచి మాక్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిందని.. అది కూడా ఫ్రీగానే అని ప్రకటించింది. వీడియోలను ఆఫ్‌లైన్‌లో చూడటానికి, డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. పైగా యాప్‌లో వీడియోలను చూసేటప్పుడు, డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు క్వాలిటీని ఎంచుకునే ఆప్షన్‌ కూడా ఉన్నట్లు వెల్లడించింది.

ఫిక్చర్‌ ‌ఇన్‌ ఫిక్చర్‌, ఎయిర్‌ ప్లే వంటి ఫీచర్లు ఉన్నట్లు అమెజాన్‌ తెలిపింది. ఒక డివైజ్‌లో కంటెంట్‌ను ప్రారంభించి, మరొక డివైజ్‌లో చూడాలనుకున్నప్పుడు.. వీడియోను ఎక్కడ ఆపేసారో అక్కడ నుంచే ప్రచారం అవుతుందని వివరించింది. యాపిల్‌ వినియోగదారులు కంటెంట్‌ను అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేసుకోవచ్చు. అమెజాన్ తన లైవ్ స్పోర్ట్స్ లైనప్‌లో గురువారం రాత్రి ఫుట్‌బాల్, ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ అందుబాటులో ఉంటే చూసే వెసులుబాటును కల్పిస్తుంది. ఆటోప్లే, సబ్‌టైటిల్స్‌, ప్రిఫరెన్స్‌, పేరెంట్‌ కంట్రోలింగ్‌, ఇతర డివైజెస్‌లో చూసే అవకాశం వంటి ఆప్షన్లు ఉన్నట్లు అమెజాన్ తెలిపింది.

Next Story