భారత వ్యాపారులకు అమెజాన్ తీపికబురు..

by  |
భారత వ్యాపారులకు అమెజాన్ తీపికబురు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ భారత్‌లో తన ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ యాక్సిలరేటర్(ఐపీ యాక్సిలరేటర్) కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించింది. అమెజాన్ ద్వారా అమ్మకాలను నిర్వహిస్తున్న వ్యాపారులకు న్యాయ పరమైన సేవలను పొందేందుకు వీలుగా ఐపీ నిపుణుల నుంచి సహాయానికి ఈ కార్యక్రమం ద్వారా వీలవుతుందని అమెజాన్ వెల్లడించింది. చిన్న, మధ్య తరహా అమ్మకందారులతో పాటు వ్యాపారుల ట్రేడ్‌మార్క్‌ను రక్షణ, వారి బ్రాండ్లకు సంబంధించి అన్ని సమస్యల పరిష్కారాలకు ఈ ఐపీ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని ఎంచుకోవచ్చని అమెజాన్ వివరించింది. అమెజాన్ టెక్నాలజీ, బ్రాండ్ ప్రొటెక్షన్ వైస్ ప్రెసిడెంట్ మేరి బెత్ మాట్లాడుతూ.. ఐపీ యాక్సిలరేటర్ కార్యక్రమం ఇప్పటికే అమెరికా, యూరప్, కెనడాలతో అందుబాటులో ఉంది. ఈ కార్యక్రమం ప్రయోజనాలను భారత వ్యాపారులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం వారి బ్రాండ్ల రక్షణకు తోడ్పడుతుంది. వినియోగదారులకు సైతం ప్రతి ఒక్కరికీ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని’ చెప్పారు.


Next Story

Most Viewed