మేడారానికి అమరావతి రైతులు..

by  |
మేడారానికి అమరావతి రైతులు..
X

తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఏపీలోని అమరావతి రైతులు వెళ్లనున్నారు. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకురావడంతో గత 50రోజులకు పైగా రైతులంతా దీక్షలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే. కోరిన కోర్కెలు తీర్చే మేడారం అమ్మవార్లను దర్శించుకుంటే సీఎం జగన్ మనసు మారొచ్చని రాజధాని రైతులు భావిస్తున్నట్టు సమాచారం.

Next Story