- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మళ్లీ పెళ్లి చేసుకున్న అమలాపాల్
<p>దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అమలాపాల్ మళ్లీ పెళ్లి చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ సింగర్ భవ్నిందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా వివాహం చేసుకున్న అమలాపాల్.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి అభిమానుల ఆశీర్వాదం కోరింది. నెట్టింట్లో ఈ పిక్స్ వైరల్ కాగా… శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు. తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా.. కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ అమలాపాల్ మళ్లీ పెళ్లి చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ సింగర్ భవ్నిందర్ సింగ్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. అత్యంత సన్నిహితుల మధ్య రహస్యంగా వివాహం చేసుకున్న అమలాపాల్.. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసి అభిమానుల ఆశీర్వాదం కోరింది. నెట్టింట్లో ఈ పిక్స్ వైరల్ కాగా… శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.
తెలుగు, తమిళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలా.. కెరియర్ పీక్స్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ వివాహబంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇద్దరి మధ్య మనస్పర్థల వల్ల కొంత కాలానికే విజయ్‌కు విడాకులిచ్చేసిన అమలాపాల్.. ఇన్నాళ్లు ఒంటరిగానే ఉండిపోయింది. అమలాపాల్ సినిమాల్లో నటించొద్దని కండిషన్ పెట్టడం వల్లే బంధాన్ని తెంచుకున్నట్లు తెలిసింది. అయితే ఈ మధ్య భవ్నిందర్ సింగ్‌తో కలిసి ట్రిప్‌లకు వెళ్లడం.. ఎక్కడ చూసినా ఇద్దరే కనిపించడంతో… మళ్లీ అమలా ప్రేమలో పడింది? పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ అమలాపాల్ బన్వీందర్ సింగ్‌తో సింధూరం పెట్టించుకుంది.
Tags: Amala Paul. Bhavninder Singh, Marraige, Second Marraige, Director Vijay






