ఆక్సిజన్ కొరతపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by  |
ఆక్సిజన్ కొరతపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా హాస్పిటల్స్‌లలో ఆక్సిజన్ కొరత వల్ల కరోనా పేషెంట్లు మరణిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ అందక చనిపోతున్నారన్న విషయం నిజంగా మారణహోమం వంటిదేనని వ్యాఖ్యానించింది. దీనికి పాలకులే బాధ్యత తీసుకోవాలని, ఆక్సిజన్ సరఫరా చేయలేకపోవడం నేరపూరిత చర్యలేనంది.

లక్నో, మీరట్ జిల్లాల్లో ఆక్సిజన్ అందక పలువురు కరోనా బాధితులు మరణించడంపై దాఖలైన పిల్‌కు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా సప్లయ్ చైన్‌ను నిర్వహించలేని అధికారులు, నేతలు అసమర్థులేనని అసంతృప్తి వ్యక్తం చేసింది.

Next Story

Most Viewed