‘రైతులను బానిసలుగా మారుస్తున్న ప్రభుత్వాలు’

by  |
‘రైతులను బానిసలుగా మారుస్తున్న ప్రభుత్వాలు’
X

దిశ సిద్దిపేట: రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చేవరకు పోరాటం చేస్తామని అఖిలపక్షం నాయకులు స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేటలోని కలెక్టరేట్ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు అఖిలపక్షం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, సీపీఎం నాయకుడు పవన్‌లు మాట్లాడుతూ.. సాగు చట్టాలు, పెట్రో, గ్యాస్‌ ధరలు, పోడుభూముల వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పేదలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పనిచేసిందని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం అన్నదాతలను బానిసలుగా మారుస్తున్నదని చెప్పారు. నూతన సాగు చట్టాలు మరణ శాసనాలని మండిపడ్డారు. వాటితో రైతుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహించారు. సాగును బడా కార్పొరేట్లు అదానీ, అంబానీలకు మోడీ తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ టీఆర్ఎస్‌లకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ప్రజలు రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రభుత్వాలు ప్రజలను ఆర్థిక ఇబ్బందులు పెట్టేలా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు.


Next Story

Most Viewed