ఓటీటీలో అక్షయ్ ‘బెల్ బాటమ్’?

by  |
ఓటీటీలో అక్షయ్ ‘బెల్ బాటమ్’?
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ ఫిల్మ్ ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి’ సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో థియేటర్స్ యజమానులు, ఎగ్జిబిటర్లు కాస్త రిలీఫ్ అయ్యారు. దాదాపు ఏడాది తర్వాత బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ కాబోతుండగా బిజినెస్ గాడిలో పడుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక వరుసగా బాలీవుడ్ స్టార్స్ సినిమాలు థియేటర్లోనే రిలీజ్ అవుతాయనుకున్నా… అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ ఓటీటీలోనే రిలీజ్ కానుందని సమాచారం.

లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన అక్షయ్.. లండన్‌లో సినిమా చిత్రీకరణకు హాజరయ్యాడు. చాలా తక్కువ పీరియడ్‌లో సినిమా కంప్లీట్ చేసి ప్రొడ్యూసర్స్‌కు అండగా నిలబడ్డాడు. కాగా, నిర్మాతలు వషు భగ్నానీ, జాకీ భగ్నానీ ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లోనే రిలీజ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నారని బీ టౌన్ టాక్. తాము నిర్మించిన ‘కూలీ నెం.1’ సినిమాను ప్రైమ్‌లోనే రిలీజ్ చేయగా..మళ్లీ అదే రూట్‌లో ‘బెల్ బాటమ్’ విడుదల చేయాలని భావిస్తున్నారట. వాణి కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్త ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న సినిమా రిలీజ్‌పై త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.


Next Story