ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో.. అజిత్ సైక్లింగ్ ఫొటోలు

110

దిశ, సినిమా : కోలీవుడ్ సూపర్‌స్టార్ అజిత్ ‘వాలిమై’ అప్‌డేట్ ఎప్పుడెప్పుడా? అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ‘నెక్కొండ పార్వై’ తర్వాత బోనీ కపూర్, అజిత్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం అప్‌డేట్ కోసం ఏకంగా ప్రధాని మోడీనే రికమెండ్ చేయాలన్న అభిమానుల వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ‘వాలిమై’ షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమా అప్‌డేట్‌ను ట్రెండ్ చేద్దామనుకున్న ఫ్యాన్స్‌కు పండగ చేసుకునే ఫొటోస్ సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న అజిత్ సైక్లింగ్ చేస్తున్న పిక్స్ బయటకు రాగా.. వాటిని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు అభిమానులు. హైదరాబాద్ నుంచి కోల్‌కతా మీదుగా ఫ్రెండ్స్‌తో కలిసి అజిత్ సైక్లింగ్ చేయగా, తన స్నేహితులు ఈ ఫొటోలను ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..