- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
థ్రిల్లింగ్.. నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘అజీబ్ దాస్తాన్స్’
<p>దిశ, సినిమా : ఇంటర్నేషనల్ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్‌తో వ్యూయర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ అవుతున్న పలు సిరీస్‌లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే విడుదలైన ‘పావకధైగల్, పిట్ట కథలు, బాంబే బేగమ్స్’ వంటి సిరీస్‌లు సూపర్ సక్సెస్ సాధించగా, త్వరలోనే ‘అజీబ్ దాస్తాన్స్’ అనే సరికొత్త ఆంథాలజీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. నాలుగు డిఫరెంట్ అండ్ […]</p>

దిశ, సినిమా : ఇంటర్నేషనల్ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’.. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ కంటెంట్‌తో వ్యూయర్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ అవుతున్న పలు సిరీస్‌లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతోంది. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌లో ఇప్పటికే విడుదలైన ‘పావకధైగల్, పిట్ట కథలు, బాంబే బేగమ్స్’ వంటి సిరీస్‌లు సూపర్ సక్సెస్ సాధించగా, త్వరలోనే ‘అజీబ్ దాస్తాన్స్’ అనే సరికొత్త ఆంథాలజీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుంది. నాలుగు డిఫరెంట్ అండ్ యూనిక్ స్టోరీస్ సంకలనంగా ఈ సిరీస్ తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుండగా.. వాటి కథనంలో ఊహించని మలుపులు ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు.
కాగా బ్యూటిఫుల్ హీరోయిన్ అదితిరావు హైదరి, ఫాతిమా సనా షేక్, జైదీప్ అహ్లావత్, కొంకణా సేన్ శర్మ, షెఫాలి షా ఈ ఆంథాలజీలో కీలక పాత్రలు పోషించారు. ఇక శశాంక్ ఖైతాన్, రాజ్ మెహతా, నీరజ్ ఘైవాన్, కయోజ్ ఇరానీ ఈ నాలుగు కథలను డైరెక్ట్ చేయగా, ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.. తన డిజిటల్ వింగ్ ప్రొడక్షన్ హౌస్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఈ ఆంథాలజీని నిర్మించారు. కాగా ‘అజీబ్ దాస్తాన్స్’ ఏప్రిల్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.






