5జీ ట్రయల్స్‌లో అత్యధిక డౌన్‌లోడ్ వేగం నమోదుచేసిన ఎయిర్‌టెల్!

by  |
5జీ ట్రయల్స్‌లో అత్యధిక డౌన్‌లోడ్ వేగం నమోదుచేసిన ఎయిర్‌టెల్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త 5జీ నెట్‌వర్క్ ట్రయల్స్‌లో దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ 1.2 జీబీపీఎస్ వేగాన్ని సాధించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముంబైలో జరిగిన ఈ ట్రయల్స్‌లో ఇంటర్నెట్ వేగం సెకనుకు 1జీబీపీఎస్‌ను దాటి నమోదైనట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నోకియా నెట్‌వర్క్ పరికరాల ద్వారా ఈ ట్రయల్స్ నిర్వహించినట్టు తెలుస్తోంది. అలాగే, అప్‌లోడ్ వేగం 850 ఎంబీపీఎస్‌కు చేరువలో నమోదైనట్టు కంపెనీ పేర్కొంది.

టెలికాం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. ఎయిర్‌టెల్ కంపెనీ 3,500 మెగా హెర్ట్జ్ బ్యాండ్‌లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. త్వరలో ఈ ట్రయల్స్‌ను కోల్‌కతాలోను చేపట్టనున్నట్టు ఎయిర్‌టెల్, నోకియా సంయుక్తంగా వెల్లడించాయి. కాగా, ఎయిర్ టెల్ కంపెనీకి 3,500 మెగాహెర్ట్జ్, 28 గిగా హెర్ట్జ్, 700 మెగా హెర్ట్జ్ బ్యాంక్‌ల 5జీ స్పెక్ట్రమ్‌లను టెలికాం శాఖా కేటాయించగా, మొదటిసారిగా ఎయిర్‌టెల్ కంపెనీ హైదరాబాద్‌లో విజయవంతంగా లైవ్ నెట్‌వర్క్ ద్వారా 5జీ ట్రయల్స్ నిర్వహించింది. దీనికోసం 1,800 మెగా హెర్ట్జ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించింది. ఇక, తర్వాత ట్రయల్స్‌ను ఢిల్లీ, కోల్‌కతాతో పాటు బెంగళూరు నగరాల్లో ఎయిర్‌టెల్ నిర్వహించనుంది.


Next Story

Most Viewed