భారీగా పెరిగిన ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు

by  |
భారీగా పెరిగిన ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ జనవరిలో అత్యధిక సంఖ్యలో మొబైల్ చందాదారులకు దక్కించుకుంది. వొడాఫోన్ ఐడియా(వీ), రిలయన్స్ జియో సైతం తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయి. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ జనవరి నెలకు సంబంధించిన వివరాల ప్ర్కారం..ఎయిర్‌టెల్ 58.92 లక్షల సబ్‌స్క్రైబర్లను చేర్చుకోగా, జియో 19.56 లక్షలు, వొడాఫోన్ ఐడియా 17.10 లక్షల మందిని చేర్చుకుంది. ఇక, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 81.659 చందాదారులకు సాధించగా, ఎంటీఎన్ఎల్ 8,312, రిలయన్స్ కమ్యూనికేషన్ 625 మందిని కోల్పోయాయి. జనవరి 31 నాటికి దేశంలో మొత్తం వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 96.35 లక్షలు పెరిగి 116.34 కోట్లకు చేరుకుంది. వైర్‌లైన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లకు పెరిగింది. ఇక, మార్కెట్ వాటా పరంగా జియో అత్యధికంగా 35.30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఎయిర్‌టెల్ 29.62 శాతంతో రెండో స్థానంలోనూ, వొడాఫోన్ ఐడియా 24.58 శాతంతో కొనసాగుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ 10.21 శాతం, ఎంటీఎన్ఎల్ 0.28 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

Next Story