- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పైలట్ల లైసెన్స్ కోసం ప్రయాణీల్లేకుండానే టేకాఫ్!
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు సైతం కొవిడ్ నష్టాలను పూడ్చుకునేందుకు.. వందలాది మంది తమ ఉద్యోగులను తీసేస్తూ రోడ్డున పడేస్తున్నాయి. మరోపక్క చిన్న కంపెనీలన్నీ దుకాణాలు సర్దేస్తున్నాయి. ఈ క్రమంలో విమానయాన రంగంపైనా ఈ కొవిడ్ ప్రభావం అధికంగానే ఉంది. దేశీ, విదేశీ ప్రయాణాలు లేకపోవడం, పర్యాటక ప్రదేశాలు కూడా తెరుచుకోకపోవడంతో ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ […]</p>

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు సైతం కొవిడ్ నష్టాలను పూడ్చుకునేందుకు.. వందలాది మంది తమ ఉద్యోగులను తీసేస్తూ రోడ్డున పడేస్తున్నాయి. మరోపక్క చిన్న కంపెనీలన్నీ దుకాణాలు సర్దేస్తున్నాయి. ఈ క్రమంలో విమానయాన రంగంపైనా ఈ కొవిడ్ ప్రభావం అధికంగానే ఉంది. దేశీ, విదేశీ ప్రయాణాలు లేకపోవడం, పర్యాటక ప్రదేశాలు కూడా తెరుచుకోకపోవడంతో ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయాయి. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ దక్షిణ కొరియాకు చెందిన ‘ఆసియానా ఎయిర్ లైన్స్’ ఉద్యోగులు గురించి ఆలోచించింది. తమ పైలట్ల లైసెన్స్ రద్దు కాకుండా ఉండేందుకు ప్రయాణీకులు లేకుండా ఖాళీగా విమాన సర్వీసులు నడిపిస్తోంది.
‘ది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్’ గైడ్‌లైన్స్ ప్రకారం.. పైలట్లు 90 రోజల వ్యవధిలో తప్పనిసరిగా మూడుసార్లు ఎయిర్‌క్రాఫ్ట్ టేకాఫ్, ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్ బ్రేక్ చేస్తే.. వారి లైసెన్స్ రద్దవుతుంది. ఇందుకోసం ఆసియానా ఎయిర్ లైన్స్.. ప్రపంచంలోనే అతి భారీ విమానమైన ‘ఎయిర్ బస్ ఎస్ఈ ఏ380’ను పైలట్ల ప్రాక్టీసు కోసం అందుబాటులో ఉంచింది. దీంట్లో కొన్ని గంటల పాటు పైలట్లు.. టేకాఫ్, ల్యాండింగ్ చేయడం సాధన చేశారు. జపాన్‌కు చెందిన ‘ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్’ కూడా ఏ380 విమానాలను రెండింటినీ మెయింటైన్ చేస్తోంది. అయితే వారి పైలట్లకు సేమ్ ఇలాంటి సమస్యే ఎదురైంది. దాంతో జపాన్ ఏవియేషన్ అథారిటీ ‘ఫ్లైయింట్ క్రెడిన్షియల్’కు ఎక్సెటెన్షన్ ఇచ్చేందుకు అనుమతిచ్చింది. థాయ్‌ల్యాండ్‌లో సిమ్యులేటర్ ద్వారా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉన్నప్పటికీ.. కొవిడ్ ఆంక్షల కారణంగా సదరు సంస్థ సిమ్యులేటర్‌ను బ్లాక్ చేసింది.






