అపాయం ముంచుకొస్తోంది.. ఆ భ్రమలో ఉండిపోకండి : AIIMS డైరెక్టర్

by  |
randeep guleria
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో రోజురోజుకూ రెట్టింపు సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. దీనిపై తాజాగా AIIMS(ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్) డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఇండియాలో టీకా అందుబాటులోకి రావడంతో కరోనా మహమ్మారి వెళ్లిపోయిందనే భ్రమలో దేశప్రజలు ఉన్నారని ఆయన తెలిపారు.

అందువల్లే ఎవరూ మాస్కులు ధరించడం లేదని, కొవిడ్ రూల్స్‌ను పాటించడం లేదని మండిపడ్డారు. కాగా, కరోనా మహమ్మారి కొత్త రూపాన్ని సంతరించుకుంటోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో కరోనా మాయమైందనే అపొహలో జనం ఉండకూడదని గట్టిగా హెచ్చరించారు.



Next Story

Most Viewed