- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nano urea plus: రైతులకు వరంగా నానో యూరియా ప్లస్... ఉపయోగాలు ఇవే!
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పంట వేసిన సమయానికి సరిపడా యూరియా దొరక్కపోవడంతో ఉదయం లేచినప్పటి నుండి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పంట వేసిన సమయానికి సరిపడా యూరియా దొరక్కపోవడంతో ఉదయం లేచినప్పటి నుండి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే నిజానికి యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో యూరియా ప్లస్ (nano urea plus) అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కొందరు నానో యూరియా వినియోగిస్తుండగా దీని కంటే నానో యూరియా ప్లస్ వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
నానో యూరియా ప్లస్ లో నానో యూరియా 20 శాతం ఎక్కువ నత్రజని (nitrozen) ఉంటుంది. దీని వల్ల పంట దిగుబడి నాణ్యత కూడా పెరుగుతుంది. దీని వల్ల పర్యావరణ సమస్యల నుండి కూడా పంట తట్టుకుంటుంది. పంట ఎదిగే కీలక దశలో దీనిని స్ప్రే చేయాలి. నానో యూరియా ప్లస్ వాడటం వల్ల కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం మెరుగై పంట దిగుబడి సైతం పెరుగుతుంది. ఇది క్లోరోఫిల్ ఛార్జర్ మరియు దిగుబడి బూస్టర్ లా పనిచేస్తుంది. 500 ml నానో యూరియా ఒక బస్తా యూరితో సమానం అని చెబుతున్నారు. కాబట్టి రైతులు యూరియా బస్తాలు దొరకనిసమయంలో ఆందోళన చెందకుండా నానో యూరియా మరియు నానో యూరియా ప్లస్ లను వాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.






