ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లోనూ వయోపరిమితి పెంపు

by Shyam |   (  Updated:2021-04-04 12:20:52  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లోనూ వయోపరిమితి పెంపు వర్తించనున్నట్లు ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రభుత్వ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఇనిస్టిట్యూషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, కార్పొరుషన్లలోని ఉద్యోగులకు కూడా ఈ చట్టం వర్తించనుంది. ఇందుకు సంబంధించి ఆయా [&hellip;]</p>

ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లోనూ వయోపరిమితి పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిధిలోని సంస్థల్లోనూ వయోపరిమితి పెంపు వర్తించనున్నట్లు ఆదివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ప్రభుత్వ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఇనిస్టిట్యూషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది, కార్పొరుషన్లలోని ఉద్యోగులకు కూడా ఈ చట్టం వర్తించనుంది.

ఇందుకు సంబంధించి ఆయా శాఖలవారీగా కార్యదర్శులు, విభాగాల అధిపతులు ఉద్యోగులకు సంబంధించిన వివరాలను తీసుకోవాలని సీఎస్ సూచించారు. అలాగే వాటిని ఆయా శాఖల వారీగా ఆర్థిక విభాగాలకు అందించాలని సీఎస్ పేర్కొన్నారు.

Next Story