- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో మోనోలిత్.. ఇంగ్లాండ్‌లో ప్రత్యక్షం!
<p>దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఉటా ఎడారితో పాటు రొమేనియాలోని కాలిఫోర్నియాలో ఇటీవలే మోనోలిత్(లోహపు స్తంభం)లు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా అవి ఎలా ప్రత్యక్షమయ్యాయి. వాటిని అక్కడ ఎవరు పెట్టి ఉంటారు? అని ఆఫీసర్లు తెలుసుకునే లోపు ఇప్పుడు మరోచోట మోనోలిత్ బయటపడింది. ఇంగ్లాండ్‌లోని ఐజిల్ ఆఫ్ విట్ ద్వీపంలో మోనోలిత్ ప్రత్యక్షమైంది. అయితే మొదటి నుంచి కూడా ఇది గ్రహాంతర వాసుల పనే అని కొందరు వాదిస్తున్నా, అందుకు సరైన ఆధారాలేవీ లేవు. ఇటీవల […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని ఉటా ఎడారితో పాటు రొమేనియాలోని కాలిఫోర్నియాలో ఇటీవలే మోనోలిత్(లోహపు స్తంభం)లు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా అవి ఎలా ప్రత్యక్షమయ్యాయి. వాటిని అక్కడ ఎవరు పెట్టి ఉంటారు? అని ఆఫీసర్లు తెలుసుకునే లోపు ఇప్పుడు మరోచోట మోనోలిత్ బయటపడింది. ఇంగ్లాండ్‌లోని ఐజిల్ ఆఫ్ విట్ ద్వీపంలో మోనోలిత్ ప్రత్యక్షమైంది. అయితే మొదటి నుంచి కూడా ఇది గ్రహాంతర వాసుల పనే అని కొందరు వాదిస్తున్నా, అందుకు సరైన ఆధారాలేవీ లేవు.
ఇటీవల మోనోలిత్‌ల గురించి వార్తల ద్వారా తెలుసుకున్న తాను తన పెట్ డాగ్‌తో కలిసి వెళ్తుండగా ఆదివారం ఈ లోహపు స్తంభాన్ని గుర్తించానని ఐలాండ్ వాసి టామ్ డన్ఫర్డ్ తెలిపారు. చూడగానే అది మోనోలితేనని గుర్తించానని వెల్లడించాడు. కాగా, ఇది నిజమా? లేదా ఏదైనా మూవీ సిరీస్ కోసం ఇలా ప్రోమో రిలీజ్ చేస్తున్నారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోనోలిత్‌లు అలా ఎలా ప్రత్యక్షమవుతున్నాయనే విషయం మిస్టరీగానే మిగిలిపోతుందేమోనని పలువురు విశ్లేషిస్తున్నారు.






