'ఆదిపురుష్' అప్‌డేట్

by  |
ఆదిపురుష్ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ నుంచి మరో అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, క్రిష్ణన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2022లో ఆగష్టు 11న సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానున్న ఆదిపురుష్ 2021 జనవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్న ఈ చిత్రంలో సీత ఎవరు? అనేదానిపై త్వరలోనే మరో అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

కాగా ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే శ్యామ్’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. తాజాగా ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసిన డార్లింగ్.. హైదరాబాద్‌లో జరిగే ఫైనల్ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ‘ఆదిపురుష్‌’తో పాటు ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రానున్న సినిమాలతో బిజీ అయిపోనున్నారు రెబల్ స్టార్.


Next Story

Most Viewed