వైసీపీ సభలో ఘోరప్రమాదం… విరిగిపడ్డ కొబ్బరి చెట్టు

80

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం రేలంగిలో శనివారం సాయంత్రం వైసీపీ సభ జరుగుతుండగా కొబ్బరి చెట్టు విరిగిపడటంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను గరక శాంత (35), దుర్గాభవాని (35)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.