- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బిగ్‌బాస్ షోకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజీ ఉంటుంది. పార్టిసిపెంట్స్ జాబితాను అఫిషియల్ గా ప్రకటించడంతో ఆ హైప్ మరింతగా పెరిగిపోయింది. దీంతో సాధారణంగానే పార్టిసిపెంట్స్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచే ప్రేక్షకులు ఈసారి కూడా వారి గురించి గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా ఈ సారి జాబితాలో తెలియని వారే ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలో సూర్య కిరణ్ ఒకరు. సుమంత్ నటించిన సత్యం సినిమా ద్వారా మంచి దర్శకునిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ధన51, రాజుభాయ్ సినిమాలను తీసినా అవి అంత పెద్దగా హిట్ సాధించలేకపోయాయి.
కాగా ఆయనకు ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ కళ్యాణితో వివాహం జరిగింది. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కళ్యాణి. ఆ తర్వాత కాలంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. చాలా కాలంగా సూర్యకిరణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక బిగ్‌బాస్‌తో సూర్యకిరణ్ లైఫ్ టర్న్ అవుతుందో లేదో చూడాలి.