‘అమరన్’గా ఆది సాయికుమార్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

by  |
‘అమరన్’గా ఆది సాయికుమార్.. ఇంట్రెస్టింగ్ స్టోరీ
X

దిశ, సినిమా : యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమరన్ : ఇన్ ది సిటీ – చాప్టర్ 1’. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘జెమినీ’ సమర్పణలో ఎస్‌వీఆర్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా అవికాగోర్ నటిస్తుండగా, సినిమా షూట్ ఈ రోజు(శనివారం) హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. కాగా ఎస్‌. బల‌వీర్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇక హీరో హీరోయిన్లపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి సాయికుమార్ క్లాప్‌నివ్వగా, జెమినీ మూర్తి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఇన్నోవేటివ్‌, యూనిక్‌ పాయింట్‌తో ఈ సినిమా రూపొందబోతున్నదని.. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్‌ సరికొత్త లుక్‌తో కనిపిస్తారని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులను ఎంగేజ్‌ చేసే కథాంశంతో పాటు థ్రిల్లర్‌, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా వస్తుందని హామీనిచ్చారు. ఆదిత్య ఓం, కృష్ణుడు, మనోజ్‌ నందన్‌, వీర్‌ శంకర్‌, పవిత్రా లోకేశ్‌, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కృష్ణ చైతన్య సంగీతం అందిస్తున్నారు. ఇక ఆది హీరోగా ఇటీవలే వచ్చిన ‘శశి’ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకోపోయింది.



Next Story

Most Viewed