- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి మత్తులో మహిళను వేధించిన యువకుడు.. భర్తకు తెలియడంతో
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఓ యువకుడు గంజాయి మత్తులో హల్ చల్ చేశాడు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్న అతడు స్థానికంగా ఉండే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళ చేయి పట్టుకుని నానా ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన భర్త, కుటుంబ సభ్యుల వద్ద చెప్పుకుని బోరున విలపించింది. దీంతో భర్త, స్థానికులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఓ యువకుడు గంజాయి మత్తులో హల్ చల్ చేశాడు. గంజాయి మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో ఉన్న అతడు స్థానికంగా ఉండే ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. మహిళ చేయి పట్టుకుని నానా ఇబ్బందులకు గురి చేశాడు.
దీంతో బాధిత మహిళ జరిగిన విషయాన్ని తన భర్త, కుటుంబ సభ్యుల వద్ద చెప్పుకుని బోరున విలపించింది. దీంతో భర్త, స్థానికులు కలిసి గంజాయి మత్తులో తూలుతున్న నిందితుడిని పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాడేపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






