ఇదెక్కడి విడ్డూరం.. రైస్ కుక్కర్ ని పెళ్లాడిన యువకుడు.. దాంతో అలాచేసి, చివరికి

by  |
ఇదెక్కడి విడ్డూరం.. రైస్ కుక్కర్ ని పెళ్లాడిన యువకుడు.. దాంతో అలాచేసి, చివరికి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించినవారు ఎప్పుడు తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ప్రతిఒక్కరు పెళ్లి చేసుకుంటారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఎన్నో పెళ్లిళ్లు చూసే ఉంటారు.. ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం.. మొన్నీమధ్య ఒక మోడల్ తనను తానే పెళ్లి చేసుకోవడం కూడా చూసే ఉంటారు. కానీ ఒక యువకుడు మాత్రం తన కుక్కర్ ని పెళ్లి చేసుకొన్నాడు. ఇదెక్కడి విడ్డూరం అని నోళ్లు వెళ్లబెడుతున్నారా.. ఏదో సరదాకి చేసి ఉంటాడులే అనుకోకండి.. ఆ పెళ్లిని చట్టబద్దం చేస్తూ పత్రాలపై సంతకం కూడా పెట్టాడు. ఈ విడ్డూరమైన పెళ్లి ఇండోనేషియాలో జరిగింది.

వివరాలలోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన ఒక యువకుడు, రైస్ కుక్కర్ ని ప్రేమించాడు. దాన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పెళ్ళికి ముహూర్తం పెట్టాడు. పెళ్లి వేడుకకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి పెళ్లిని రిజిస్టర్ చేసే అధికారిని కూడా ఇంటికి తీసుకొచ్చాడు. వరుడు తెల్లటి డ్రెస్ లో మెరిసిపోతూ వచ్చి కూర్చున్నాడు.. వధువు రైస్ కుక్కర్ కి సైతం తెల్లటి డ్రెస్ ధరించి కూర్చోపెట్టాడు. పెళ్లి తతంగం అయిపోయాక వధూవరులిద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. వరుడు రొమాంటిక్ గా వధువును కిస్ చేస్తూ మరీ ఫోటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని పోస్ట్ చేస్తూ వరుడు వైట్‌..క్వైట్‌..పర్ఫెక్ట్‌..వెరీ డ్రీమీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు. అయితే పెళ్లి చేసుకున్న 10 రోజులకే అతను రైస్ కుక్కర్ కి విడాకులు కూడా ఇచ్చేశాడు. తన భార్య(రైస్ కుక్కర్) ఒక్క అన్నం మాత్రమే వండుతుందని, మిగతావేవీ వండడానికి పనికి రావడంలేదని ఫిర్యాదు చేస్తూ విడాకులకు అప్లై చేశాడు. ఇక ఈ వార్త విన్న నెటిజన్లు అతగాడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. వీడికి పిచ్చెక్కి ఇలాంటి పనులు చేస్తున్నాడు అని కొందరు అంటుండగా.. పబ్లిసిటీ కోసం చేస్తున్నాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed