- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దారుణం: మైనర్ బాలికను బెదిరించి అత్యాచారం
<p>దిశ, రాజేంద్రనగర్: మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధ కోసం ఇద్దరు కూతుళ్లును తీసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. అత్యవసర పనిపై దంపతులు స్వగ్రామానికి వెళ్లాల్సి రావడంతో పిల్లలను శంషాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో వదిలివెళ్లారు. అదే బంగళాలో అద్దెకు ఉంటున్న యూపీకి చెందిన గోపీ అనే వ్యక్తి […]</p>

దిశ, రాజేంద్రనగర్: మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అస్సాం రాష్ట్రానికి చెందిన దంపతులు ఉపాధ కోసం ఇద్దరు కూతుళ్లును తీసుకుని హైదరాబాద్‌కు వచ్చారు. అత్యవసర పనిపై దంపతులు స్వగ్రామానికి వెళ్లాల్సి రావడంతో పిల్లలను శంషాబాద్‌లోని తమ బంధువుల ఇంట్లో వదిలివెళ్లారు. అదే బంగళాలో అద్దెకు ఉంటున్న యూపీకి చెందిన గోపీ అనే వ్యక్తి ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి బలవంతంగా తన గదికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచార దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలను యూ ట్యూబ్‌లో పెడతాననంటూ బెదిరించారు. తన వద్ద గన్ ఉంది.. దాంతో నీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గోపిని అదుపులోకి తీసుకున్నారు.






