నల్లగొండలో సంచలనం.. చర్చికి వచ్చే మహిళలే అతడి టార్గెట్..19 మందిని..

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-09 00:11:59  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : నల్లగొండలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బట్టబయలైంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ చర్చిలో విలియమ్స్ అనే వ్యక్తి పియానో వాయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే అదునుగా.. విలియమ్స్ చర్చికి వచ్చే యువతులు, మహిళలను మాయ మాటలతో ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అనంతరం యువతులు, మహిళలను లోబరుచుకొని పెళ్లి పేరుతో మోసం చేస్తున్నాడు. ఇలా ఏకంగా 19 మంది మహిళలను పెళ్లాడాడు. అయితే మొదటి భార్య.. అతనిపై ఫిర్యాదు చేయడంతో [&hellip;]</p>

నల్లగొండలో సంచలనం.. చర్చికి వచ్చే మహిళలే అతడి టార్గెట్..19 మందిని..
X

దిశ, వెబ్‌డెస్క్ : నల్లగొండలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. నిత్య పెళ్లికొడుకు వ్యవహారం బట్టబయలైంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ చర్చిలో విలియమ్స్ అనే వ్యక్తి పియానో వాయిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇదే అదునుగా.. విలియమ్స్ చర్చికి వచ్చే యువతులు, మహిళలను మాయ మాటలతో ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. అనంతరం యువతులు, మహిళలను లోబరుచుకొని పెళ్లి పేరుతో మోసం చేస్తున్నాడు.

ఇలా ఏకంగా 19 మంది మహిళలను పెళ్లాడాడు. అయితే మొదటి భార్య.. అతనిపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విలియమ్స్ బాగోతం బట్టబయలు కావడంతో పోలీసులు రంగంలోకి అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. నిందితుడు గుండెపోటు వచ్చిందంటూ ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story