డేట్ అఫ్ బర్త్ తప్పు చెప్పినందుకు విడాకులా?

by  |
డేట్ అఫ్ బర్త్ తప్పు చెప్పినందుకు విడాకులా?
X

దిశ వెబ్‌డెస్క్: తన భార్య డేట్ అఫ్ బర్త్ తప్పుచెప్పినందుకు విడాకులు ఇవ్వాలని హైకోర్టుకెక్కాడు ఒక భర్త. ఈ విచిత్ర సంఘటన ముంబైలో జరిగింది. ముంబైకి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల పెళ్లి అయింది. అయితే పెళ్లి చూపులు సమయంలో భార్య పుట్టినరోజు తప్పుగా చెప్పిందని, తమకు విడాకులు ఇవ్వాలని ఆ వ్యక్తి ఇటీవల ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఫ్యామిలీ కోర్టు అతడి పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు.

ఇలాంటి విచిత్ర కేసును చూసి షాకైన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. జస్టిస్ చంద్రుర్కర్, ఎస్బీ సూర్యవంశీ ధర్మాసనం ఈ కేసును విచారించగా.. భర్త సరైన ఆధారాలు నిరూపించలేకపోవంతో కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. తాను పెళ్లి చూపులు సమయంలో అబద్ధం చెప్పలేదని, తన స్టడీ సర్టిఫికేట్స్‌లో కూడా ఇదే ఉందని ఆమె కోర్టుకు ఆధారాలు చూపించింది.

ఆమె డేట్ అఫ్ బర్త్ తప్పుగా చెప్పిందని భర్త ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయాడు. దీంతో ఆమె ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం భర్త వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇలాంటి విచిత్ర కారణాలతో విడాకులు అడగడం సరికాదని కోర్టు తేల్చిచెప్పింది.

అయితే పిటిషన్ వేసిన వ్యక్తి జాతకాలను బాగా నమ్ముతాడు. పెళ్లి తర్వాత తన భార్య పుట్టినరోజుని అబద్ధం చెప్పిందేమోనని భర్తకు అనుమానం వచ్చింది. ఆ అనుమానంతో తనను ఎప్పుడూ హింసిస్తూ ఉండేవాడని భార్య చెబుతోంది.


Next Story

Most Viewed